: పిల్లలపై జాయింట్ కస్టడీ కోసం హాలీవుడ్ హీరో న్యాయ పోరాటం

హాలీవుడ్ లోనే అత్యంత అందమైన జంటగా పేరుగాంచిన ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ లు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20న విడాకుల కోసం ఏంజెలినా దరఖాస్తు చేసింది. తమ ఆరుగురు పిల్లలూ తన వద్దే ఉండాలంటూ పిటిషన్ లో కోరింది. ఈ నేపథ్యంలో, బ్రాడ్ పిట్ న్యాయ పోరాటానికి దిగాడు. పిల్లలకు జాయింట్ కస్టడీ కల్పించాలని కోరుతూ లాస్ ఏంజెలెస్ కోర్టులో దావా వేశాడు. 8 నుంచి 15 ఏళ్ల మధ్య వయసులో ఉన్న పిల్లలకు జాయింట్ కస్టడీ కల్పించాలని పిటిషన్ లో వేడుకున్నాడు.

More Telugu News