: నా సినీ జీవిత ప్రయాణం ‘రా’ అక్షరంతో ముడిపడింది: దర్శకుడు, నటుడు కాశీవిశ్వనాథ్

‘నా సినీ జీవిత ప్రయాణం ‘రా’ అనే అక్షరం తో ముడిపడి ఉంది. అది, యాదృచ్ఛికమో, సెంటిమెంటో తెలియదు’ అని దర్శకుడు, నటుడు కాశీవిశ్వనాథ్ అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "నా సినీ ప్రయాణం ‘రా’ అనే అక్షరంతో ముడిపడి ఉందని ఎందుకు చెబుతున్నానంటే.. నాకు దర్శకుడిగా జన్మనిచ్చింది నిర్మాత రామానాయుడు. ఉషా కిరణ్ మూవీస్ రామోజీరావు గారి ప్రోత్సాహంతో ‘నచ్చావులే’ చిత్రంలో నటుడిగా తొలిసారి నటించాను. ఈ చిత్రం డైరెక్టర్ రవిబాబు నన్ను కేరెక్టర్ నటుడిగా మలిచాడు. ఈ ముగ్గురి పేర్లు ‘ర’ అనే అక్షరంతోనే మొదలవుతాయి’ అని కాశీ విశ్వనాథ్ చెప్పారు. కాగా, ‘వైశాఖం’ అనే చిత్రం ద్వారా నటుడిగా కాశీవిశ్వనాథ్ తన వందో సినిమాను పూర్తి చేసుకోనున్నారు.

More Telugu News