: ప్రభాస్ స్కెచ్ పెయింటింగ్, రానా ప్లకార్డులతో ప్రేమ చాటుకున్న జపాన్ అభిమానులు

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం సినీ ఇండస్ట్రీలో ఎంత చరిత్ర సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రభాస్, రానాలతో పాటు మరికొందరు నటీనటులకు క్రేజ్ పెరిగిపోయేలా చేసిన ఈ చిత్రాన్ని ఇటీవల జపాన్ లో క్యోటో హిస్టారికా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అనంతరం ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు నిర్మాత శోభు యార్లగడ్డ జవాబులిచ్చారు. ఈ చిత్రంలో ప్రభాస్, రానా నటనకు మంత్ర ముగ్ధులైన జపాన్ అభిమానులు తమ ప్రేమను విభిన్నంగా చాటుకున్నారు. ప్రభాస్ స్కెచ్ పెయింటింగ్ గీసి కొంత మంది అభిమానులు, రానా ప్లకార్డులను చేతబట్టి మరికొందరు అభిమానులు తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.

More Telugu News