: పాము పుట్టలో బయటపడ్డ అమ్మవారి విగ్రహం

పాము పుట్టలోంచి అమ్మవారి విగ్రహం బయటపడ్డ ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, నిన్న నాగుల చవితి సందర్భంగా... పశువుల ఆసుపత్రి సమీపంలో పుట్టల కోసం తుప్పలను సరిచేస్తున్నారు. ఈ క్రమంలో, ఓ పుట్ట వద్ద పలుగుకు ఈ విగ్రహం తగిలింది. దీంతో పుట్టను తవ్వి చూడగా అమ్మవారి విగ్రహం బయటపడింది. దీంతో, విగ్రహాన్ని చూడటానికి స్థానికులు ఎగబడ్డారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆకారాన్ని బట్టి చూస్తే లక్ష్మిదేవి అని, నాగుల చవితిరోజు బయటపడింది కాబట్టి నాగమ్మ అని ఎవరికి తోచినట్టు వారు పిలుచుకుంటున్నారు.

More Telugu News