: హిల్లరీ వర్సెస్ ట్రంప్... ముందస్తు పోలింగ్ ఎవరి ఖాతాలో ఏ రాష్ట్రమంటే..!

ఓ పది రోజుల క్రితం వరకూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫు అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ విజయం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తుండగా, ఆపై ట్రంప్ దూసుకొచ్చిన వేళ, ప్రస్తుతం ఇద్దరి మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిపోయింది. ముందస్తు పోలింగ్ లో ఇప్పటివరకూ 3 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాలుగు రాష్ట్రాల్లో హిల్లరీ, మూడు రాష్ట్రాల్లో ట్రంప్ ముందున్నారు. నార్త్ కరోలినా, నెవడా, కొలరాడో, అయోవా రాష్ట్రాల్లో హిల్లరీ, ఆరిజోనా, ఫ్లోరిడా, ఓహియో రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఆరిజోనాలో 13 లక్షల మంది ఓట్లు వేయగా, రిపబ్లికన్లకు 71 వేల ఆధిక్యం కనిపించింది. ఫ్లోరిడాలో 16.95 లక్షల ఆధిక్యంలో ట్రంప్ ఉండగా, అయోవాలో హిల్లరీ 41 వేల ఆధిక్యంలో ఉన్నారు. కొలరాడోలో హిల్లరీ 18,500 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, నెవడాలో 29 వేల ఓట్లు, నార్త్ కరోలినాలో 2.43 లక్షల ఓట్ల ఆధిక్యం ఆమెకుంది. ఇవి తుది ఫలితాలు కానప్పటికీ, ఇదే సరళి నవంబర్ 8 ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News