: జనవరి, ఫిబ్రవరిలో 1,00,147 తిరుమల సేవా టికెట్లు ఆన్ లైన్లో విడుదల

2017 జనవరి, ఫిబ్రవరి నెలల్లో తిరుమల శ్రీవెంకటేశ్వరునికి వివిధ రకాల సేవలను జరిపించాలని భావించే వారి కోసం మొత్తం 1,00,147 టికెట్లను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలకు సంబంధించిన రిజర్వేషన్ కౌంటర్ నేటి ఉదయం 11 గంటల నుంచి తెరచుకోనుంది. సుప్రభాత సేవకు సంబంధించిన 9,073 టికెట్లతో పాటు 190 తోమాల, 190 అర్చన, 3,200 విశేష పూజల, 160 అష్టదళ పాదపద్మారాధన, 2,604 నిజపాద దర్శన, 20,500 కల్యాణోత్సవ టికెట్లతో పాటు 5,300 ఊంజల్ సేవ, 11,395 ఆర్జిత బ్రహ్మోత్సవ టికెట్లను, 22,360 వసంతోత్సవం, 35,175 సహస్ర దీపాలంకార సేవ టికెట్లనూ అందుబాటులోకి తీసుకువచ్చినట్టు టీటీడీ ప్రకటించింది.

More Telugu News