: అల్ ఖాయిదా అధినేత లాడెన్‌ను ఇంటర్వ్యూ చేసిన పాక్ జర్నలిస్ట్ హమీద్ మిర్‌కు మోస్ట్ రెసిలియంట్ జర్నలిస్ట్ అవార్డు

అల్ ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను ఇంటర్వ్యూ చేసిన పాక్ జర్నలిస్ట్ హమీద్ మిర్‌ను 'మోస్ట్ రెసిలియంట్ జర్నలిస్ట్' అవార్డు వరించింది. వివిధ అంశాలను రిపోర్టు చేయడంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. అమెరికాలో 9/11 దాడుల తర్వాత లాడెన్‌ను జియో టీవీలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిస్తున్న హమీద్ మిర్ తొలిసారి ఇంటర్వ్యూ చేశారు. 2014లో మిర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మిర్ తర్వాత కోలుకున్నారు. మిర్.. బిన్ లాడెన్‌తోపాటు నెల్సన్ మండేలా, టోనీ బ్లెయిర్, హిల్లరీ క్లింటన్, యాసర్ అరాఫత్ వంటి హేమాహేమీలను కూడా ఇంటర్వ్యూ చేశారు.

More Telugu News