: హిల్లరీ గెలిస్తే.. ‘కాశ్మీర్ ను పాక్’కు ఇవ్వాలని బిల్ క్లింటన్ అనుకుంటున్నారు: రిపబ్లికన్ హిందూ కొలిషన్

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డెమొక్రాటిక్, రిపబ్లికన్ అభ్యర్థులైన హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య వాడివేడీ వ్యాఖ్యలు, పరస్పర ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన హిందూ సంఘం అయిన రిపబ్లికన్ హిందూ కొలిజన్ (ఆర్ హెచ్ సీ) రూపొందించిన ఒక యాడ్ పై డెమొక్రాటిక్ పార్టీ నేతలు, అభిమానులు మండిపడుతున్నారు. ఇండియన్ అమెరికన్ టీవీ ఛానెల్స్ లో ప్రసారమవుతున్న ఈ యాడ్ లో హిల్లరీపై ఏమని ఆరోపిస్తున్నారంటే.. * హిల్లరీ క్లింటన్ పాకిస్థాన్ సానుభూతి పరురాలు. * పాక్ కు వేల కోట్ల డాలర్ల సాయం, భారత్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయుధాలు అందించారు. * ఇస్లామిక్ తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు, వ్యక్తుల నుంచి విరాళాలు సేకరించారు. * హిల్లరీ సహాయకురాలు హ్యుమా అబెదిన్ పాకిస్థాన్ సంతతికి చెందిన వ్యక్తి. * భారత ప్రధాని నరేంద్ర మోదీకి గతంలో వీసా రాకుండా అడ్డుకోవడంలో హిల్లరీదే కీలకపాత్ర * హిల్లరీ గెలిస్తే.. కాశ్మీర్ ను పాకిస్థాన్ కు ఇవ్వాలని ఆమె భర్త బిల్ క్లింటన్ అనుకుంటున్నారని, అందుకే హిల్లరీకి ఓటు వేయవద్దని అక్కడి భారతీయులను ఈ యాడ్ ద్వారా కోరుతూ ఆర్ హెచ్ సీ ప్రచారం చేస్తోంది.

More Telugu News