: ఈ పని చేస్తే పక్షవాతం, గుండెపోటు, రక్తపోటు ముప్పు తగ్గుతుంది

మన జీవనశైలిని, తీసుకునే ఆహారాన్ని కొంచెం మార్చుకుంటే... సగం ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టే. తాజాగా ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయం వెల్లడైంది. ప్రతిరోజు ఓ కోడిగుడ్డును తీసుకుంటే పక్షవాతం వచ్చే ప్రమాదం 12 శాతం తగ్గుతుందట. వాస్తవానికి గుడ్డులో కొలెస్టరాల్ ఉంటుందని... దానివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే, అధ్యయనంలో వెలుగుచూసిన విషయాలు మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నాయి. రోజూ ఒక గుడ్డు మాత్రమే తీసుకునే వారిలో బీపీ (రక్తపోటు) తగ్గుతుందని, గుండెపోటు ప్రమాదం కూడా తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. 1982 నుంచి 2015 వరకు మూడు లక్షల మందిపై పరిశోధనలు నిర్వహించి, ఫలితాలను విశ్లేషించి, ఈ విషయాలను వారు వెల్లడించారు. ఒక పెద్ద కోడిగుడ్డు ద్వారా యాంటీఆక్సిడెంట్స్, ల్యూటిన్, జియాగ్జాంతిన్, ఏ, ఈ, డీ విటమిన్లు, 6 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ మనకు అందుతుందని... దీనివల్ల పక్షవాతం ముప్పు తగ్గుతుందని పరిశోధనలో తేలింది.

More Telugu News