: టాటాల చరిత్రలో అత్యంత అవినీతిపరుడు రతన్ టాటాయే: సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర విమర్శ

టాటా గ్రూప్ సంస్థల చరిత్రలో రతన్ టాటాయే అత్యంత అవినీతిపరుడని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర విమర్శలు చేశారు. రాయ్ పూర్ లో మీడియాతో మాట్లాడిన స్వామి, "ఆయన టాటా కాదు. ఆయన తండ్రి ఓ దత్త పుత్రుడు. సైరస్ మిస్త్రీకి ఆయన అన్యాయం చేశారు. రెండు నెలల క్రితం సైరస్ మిస్త్రీని టాటాల బోర్డు ఎంతో మెచ్చుకుంది. దీంతో జలసీకి లోనైన రతన్ టాటా ఈ చర్యలకు దిగారు" అని ఆరోపించారు. 2జీ, ఎయిర్ ఆసియా, విస్తారా భాగస్వామ్య ఒప్పందం, జాగ్వార్ డీల్ వంటి కుంభకోణాల్లో రతన్ టాటాకు పాత్ర ఉందని ఆరోపించారు. స్కాముల్లో ఇరుక్కోకుండా తనను తాను కాపాడుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని అన్నారు. రతన్ టాటా అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

More Telugu News