: రెండు రోజుల్లో అనూహ్య మార్పు... ట్రంప్ కన్నా 6 పాయింట్ల ఆధిక్యంలో హిల్లరీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల చివరి దశ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఎన్నికలకు 5 రోజుల గడువు మాత్రమే ఉండగా, రెండు రోజుల క్రితం విడుదలైన సర్వేకు పూర్తి విరుద్ధంగా నేడు ఇంకో సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ట్రంప్ కన్నా హిల్లరీ 6 పాయింట్ల ముందంజలో ఉన్నారని, ఎఫ్బీఐ ప్రకటనకు పూర్వం ఆమెకెంత పాప్యులారిటీ ఉందో తిరిగి ఇప్పుడు అదే స్థాయికి ఆమె చేరుకున్నారని రాయిటర్స్ వార్తా సంస్థ, ఐపీఎస్ఓఎస్ డైలీ ట్రాకింగ్ పోల్ తెలియజేశాయి. తమ పోల్ లో 1,772 మంది పాల్గొన్నారని, వీరిలో 45 శాతం మంది క్లింటన్ కు మద్దతివ్వగా, 39 శాతం మంది ట్రంప్ ను వెనకేసుకొచ్చారని పేర్కొంది. కాగా, రెండు రోజుల క్రితం వెల్లడైన పోల్ ఫలితాల్లో ట్రంప్ 1 పాయింట్ ముందున్నారని తేలడంతో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించగా, ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే.

More Telugu News