: రూ. 700 కోట్లు నొక్కేసిన కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత... జైలు టు కోర్టు వయా మాల్స్, హోటల్స్!

కర్నూలు జిల్లా కేంద్రంగా కేశవరెడ్డి విద్యా సంస్థలను స్థాపించి, ప్రజల నుంచి పెద్దఎత్తున డిపాజిట్లు వసూలు చేసి, వాటిని తిరిగి ఇవ్వకుండా ప్రస్తుతం జైల్లో ఉన్న కేశవరెడ్డి సకల సౌకర్యాలతో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఆయన సంగారెడ్డి కోర్టులో హాజరు కావాల్సి వున్న వేళ, కర్నూలు జైలు నుంచి సంగారెడ్డి కోర్టుకు వచ్చి తిరిగి జైలుకు వెళ్లే క్రమంలో, జరిగిన బాగోతాన్నంతా ఓ టీవీ చానల్ బట్టబయలు చేసింది. కేశవరెడ్డినే ఫాలో అయిన ఆ చానల్ బృందం, ఆయన ఎక్కడెక్కడ తిరిగిందీ మొత్తం వీడియో చూపింది. కేశవరెడ్డికి తొత్తులుగా మారిన జైలు ఎస్కార్ట్ సిబ్బంది ఆయన అడుగులకు మడుగులు ఒత్తారు. ఇక కోర్టుకు హాజరు పేరుతో బయటి పనులను చక్కబెట్టుకున్నారు కేశవరెడ్డి. సంగారెడ్డికి వచ్చే వేళ, ఓ హోటలుకు, ఆపై తిరిగి వెళ్లే క్రమంలో ఓ మాల్, బ్యూటీ సెలూన్, తిరిగి రాత్రి కాస్ట్ లీ దాబాలో ఆయన ఆగుతూ, షాపింగ్ చేస్తూ, సేదదీరుతూ వెళ్లారు. ఈ దృశ్యాలన్నీ సదరు టీవీ చానల్ లో ప్రసారమై సంచలనం కలిగిస్తుండగా, పోలీసు, జైలు అధికారులు మాత్రం ఇంకా స్పందించలేదు.

More Telugu News