: సరిహద్దుల్లో పరిస్థితులపై ప్రధాని అత్యున్నత సమావేశం

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని మోదీ ఈ రోజు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పాక్ దళాలు భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతుండడం... ఈ కాల్పులకు అమాయక పౌరులు ఎనిమిది మంది వరకు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దీంతో ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాజా పరిస్థితులపై అనుసరించాల్సిన వ్యూహం గురించి ప్రధాని చర్చించినట్టు సమాచారం. అయితే, ఇది సాధారణ భేటీయేనంటూ ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ అన్నారు.

More Telugu News