: ఎఫ్బీఐ తాజా విచారణతో కష్టంగా ఉంది: హిల్లరీ క్లింటన్

ఎన్నికలకు ఇక కొద్ది రోజుల సమయమే ఉన్న సమయంలో తన పాత ఈ-మెయిల్స్ పై ఎఫ్బీఐ అధికారులు మరోమారు విచారణ జరుపుతామని చెప్పడాన్ని తాను ఊహించలేదని, అధికారుల నిర్ణయం తనను కష్టపెడుతోందని డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు, ఓ చిన్న సమాచారాన్ని పట్టుకుని తిరిగి విచారణకు నిర్ణయించడం తనను ఆశ్చర్యపరిచిందని ఫ్లోరిడాలోని ఓ ర్యాలీలో పాల్గొన్న హిల్లరీ తెలిపారు. కాగా, నవంబర్ 8న ఓటింగ్ జరగనుండగా, హిల్లరీకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని పలు సర్వేలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

More Telugu News