: గ్రీన్ కార్డుల జారీ వ్యవస్థను హేతుబద్ధం చేస్తా: ట్రంప్

భారత ఆర్థిక వృద్ధి 8 శాతంతో దూసుకెళుతుంటే, అమెరికా ఈ స్థాయి వృద్ధిని నమోదు చేయడంలో ఎందుకు విఫలమవుతోందని అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. న్యూహాంప్ షైర్ లోని మాంచెస్టర్ లో శనివారం ప్రచార సభ నిర్వహించిన ఆయన, అమెరికా అధ్యక్షుడు ఒబామా వైఖరి కారణంగానే వృద్ధి బాటన దేశం వెనుకబడిందని అన్నారు. ఇక భారతీయులను పొగిడిన ట్రంప్, గ్రీన్ కార్డుల జారీపై సానుకూలంగా మాట్లాడుతూ, గ్రీన్ కార్డుల జారీ వ్యవస్థను హేతుబద్ధం చేస్తానని, విదేశాల నుంచి నిపుణులు చట్టబద్ధంగా తమ దేశంలో కాలుమోపాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.

More Telugu News