: చైనాలో మరో వికృత వ్యాపారం.. షాపింగ్ మాల్ లలో జంతువులు బందీ!

చైనాలో వికృతమైన వ్యాపారం వెలుగు చూసింది. ప్రపంచ దేశాల్లో జూపార్కులు ఏర్పాటు చేసి అరుదైన జంతువులను ప్రదర్శించే సౌకర్యాలు ఉండగా, షాపింగ్ మాల్ లలో జంతువులను బంధించి, వాటిని ప్రదర్శించే వికృతం చైనాలో ఊపందుకుంటోంది. ఉత్తరచైనాలోని ఝంగ్షూ పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ పిజ్జా అనే ధృవపు ఎలుగుబంటిని ప్రదర్శనకు ఉంచారు. ఎక్కడో ధృవాల్లో ఉండాల్సిన పిజ్జా ఇక్కడ షాపింగ్ మాల్ లో ఉండడంతో దాని నుంచి బయటపడేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంది. నిర్వరామంగా దారులు వెతుక్కుంటోంది. అయితే ఒకవైపు అద్దాలు, మరోవైపు గోడలు చిన్న ఇనుపగేట్ ఉండడంతో అది దానిని తెరిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనిపై జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతువులను ఇలా బంధించి ఉంచడం తప్పని, తక్షణం పిజ్జాకు విడుదల కల్పించాలని డిమాండ్ చేస్తూ పోరాటం మొదలుపెట్టారు.

More Telugu News