: సాయిని పూజించే దుస్థితి ఎందుకు?: గోవిందానంద సరస్వతి

ఎంతో ఉన్నతమైన హిందూ ధర్మాన్ని వదులుకుని ఓ ముస్లింను, ఓ ఫకీరును పూజించే దుస్థితికి ఎందుకు దిగజారుతున్నారు? అంటూ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గోవిందానంద సరస్వతి ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇష్టం వచ్చిన పూజలు, పునస్కారాలు నిర్వహిస్తూ, దానికి దైవత్వం ఆపాదిస్తున్నారని విమర్శించారు. ఏ ఆధారాలతో సాయిబాబాకు దైవత్వం ఆపాదిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ధర్మానికి అపచారం జరిగితే తాము కచ్చితంగా రంగ ప్రవేశం చేస్తామని ఆయన అన్నారు. ధర్మాన్ని ఆచరించమని తాము చెబుతున్నామని, వేదాన్ని భ్రష్టుపట్టిస్తామని అంటే తాము ఊరుకోమని ఆయన తెలిపారు. గాయత్రీ మంత్రాన్ని సాయి భక్తులు కలుషితం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సాయికి ఎన్ని రూపాలు ఉన్నాయని ఆయన నిలదీశారు. ముస్లిం అయిన సాయిని హిందూ దేవతల రూపాల్లోకి ఎందుకు తీసుకొస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

More Telugu News