: ఆర్కే గాయపడటం నేను కళ్లారా చూశాను: మల్కన్ గిరి ఏరియా కమిటీ కార్యదర్శి

పోలీస్ తూటాల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టు అగ్ర నేత ఆర్కే గాయపడటం తాను ప్రత్యక్షంగా చూశానని మల్కన్ గిరి ఏరియా కమిటీ కార్యదర్శి వేణు పేర్కొన్నారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ఏవోబీలో ఆరోజు జరిగిన ఎన్ కౌంటర్ లో తానూ ఉన్నానని అన్నారు. పోలీసులు తమపై ఒక్కసారిగా విరుచుకుపడడంతో, తమకు ప్రతిఘటించే అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్పారు. ఈ ఎన్ కౌంటర్ లో తీవ్రంగా గాయపడిన ఏడుగురిని చిత్రహింసలు పెట్టి పోలీసులు చంపారని, నిన్న ఎన్ కౌంటర్ లో చనిపోయినట్లు చూపిన ఇద్దరు దళసభ్యులు తొలిరోజు కాల్పుల్లోనే చనిపోయారని చెప్పారు. మావోయిస్టులు చలపతి, అరుణ క్షేమంగా ఉన్నారని, ఈ ఎన్ కౌంటర్ లో మృతుల పేర్లకు సంబంధించి పోలీసులు కావాలనే తప్పుగా ప్రకటిస్తున్నారని ఆరోపించారు. ఎన్ కౌంటర్ లో వాకపల్లికి చెందిన కాసీరావు మృతి చెందగా, ఆ పేరుకు బదులుగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సునీల్ అని పోలీసులు ప్రకటించారన్నారు. కట్టెలు కొట్టుకునేందుకు వెళ్తున్న నలుగురు గిరిజనులను హతమార్చిన పోలీసులు, వారిని మిలీషియా సభ్యులుగా చిత్రీకరించారని వేణు ఆరోపించారు.

More Telugu News