: మరోసారి దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చిన భారత్.. 15 మంది పాక్ రేంజన్లను హతమార్చిన సైన్యం

కాల్పుల విరమణ ఒప్పందానికి త‌రచూ తూట్లుపొడుస్తున్న పాకిస్థాన్ రేంజ‌ర్ల‌కు భార‌త సైన్యం ఈ రోజు దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చింది. ఈ రోజు ఉద‌యం నుంచి జమ్ముకశ్మీర్‌ లోని కెరి, హిరానగర్‌, మెందార్‌, పూంఛ్‌ సెక్టార్‌ ల వద్ద పాక్‌ సైన్యం కాల్పులకు పాల్పడిన విష‌యం తెలిసిందే. కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ కాల్పుల‌ను దీటుగా ఎదుర్కున్న భార‌త బ‌ల‌గాలు మొత్తం 15 మంది పాకిస్థాన్ రేంజ‌న్ల‌ను హ‌త‌మార్చాయి. అయితే, ఈ సంఖ్య మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌వ‌చ్చ‌ని పాక్ రేంజ‌ర్లు మొత్తం ఎంత‌మంది హ‌త‌మయ్యారో స్ప‌ష్టంగా తెలియ‌లేద‌ని బీఎస్ఎఫ్ ఏడీజీ అరుణ్‌కుమార్ జాతీయ మీడియాకు తెలిపారు. మరోవైపు, పాక్ రేంజర్ల కాల్పులతో సరిహద్దు ప్రాంత పౌరుడు ఒకరు మరణించాడు. మరో బాలికతో పాటు ముగ్గురికి గాయాలయ్యాయి.

More Telugu News