: కాల్ సెంటర్ స్కాంలో రంగంలోకి దిగిన అమెరికా, 32 మందిపై అభియోగాలు

ఇండియాలో సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ స్కామ్ విషయంలో అమెరికా న్యాయ విభాగం రంగంలోకి దిగింది. ఈ కేసులో 32 మందిపై అభియోగాలు మోపింది. వీరంతా అమెరికన్లకు ఫోన్లు చేసి మిలియన్ల కొద్దీ డాలర్లను కాజేశారని వెల్లడించింది. వేల సంఖ్యలో బాధితులు ఉన్నారని, వీరిలో అత్యధికులు దక్షిణాసియా ప్రాంతానికి చెందిన వారని పేర్కొంది. అమెరికా ఆదాయపు శాఖ అధికారులుగా పరిచయం చేసుకుని, పన్ను ఎగ్గొట్టారని చెబుతూ, అరెస్ట్ చేస్తామని, దేశ భహిష్కరణ తప్పదని బెదిరిస్తూ కోట్ల రూపాయలను ఇండియాకు తరలించుకుపోయారని టెక్సాస్ యూఎస్ అటార్నీ తన అభియోగాల్లో పేర్కొంది. ఈ కేసులో అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 5 కాల్ సెంటర్లలోని 32 మందిపై అభియోగాలు నమోదు చేయగా, ఇప్పటివరకూ 20 మందిని భారత పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు పేర్కొంది.

More Telugu News