: కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్ రేంజర్లు.. ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలు

పాకిస్థాన్‌ కుక్కబుద్ధి మళ్లీ చూపించుకుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ, భారత పోస్టులు, సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడుతోంది. జమ్ముకశ్మీర్‌ లోని భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో కెరి, హిరానగర్‌, మెందార్‌, పూంఛ్‌ సెక్టార్‌ ల వద్ద పాక్‌ సైన్యం కాల్పులకు పాల్పడుతోంది. ఒక్కసారిగా కాల్పుల తీవ్రత పెరిగిపోవడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇళ్లు ఖాళీ చేసి, బంకర్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అయితే పాక్ రేంజర్ల దాడులను భారత జవాన్లు దీటుగా ఎదుర్కొంటున్నారు. కాగా, పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందానికి 50 సార్లు తూట్లు పొడిచి, కాల్పులకు తెగబడిందని సైనికాధికారులు తెలిపారు.

More Telugu News