: ఢిల్లీలో మందుబాబులపై ఉక్కుపాదం... భారీ జరిమానా లేదా జైలు

ఢిల్లీలోని మందుబాబులు ఇకపై తమ ప్రవర్తనను మార్చుకోకపోతే భారీ జరిమానానే కట్టాల్సి ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే, కార్లలో మందు పార్టీలు చేసుకోవడం, బహిరంగ ప్రదేశాలల్లో మద్యం సేవించడం లాంటి కార్యకలాపాలపై ఢిల్లీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిబంధనలను ఉల్లంఘించి మద్యం సేవిస్తే, నేరుగా జైలుకు కూడా వెళ్లే ప్రమాదం ఉంది. లేదా పెద్ద ఎత్తున జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే రూ. 5 వేల జరిమానా విధిస్తామని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. అంతేకాదు, మద్యం సేవించి గొడవ చేస్తే జరిమానాను డబుల్ చేయడమేకాదు, మూడు నెలల పాటు జైలుకు పంపుతారు. కార్-ఓ-బార్ (కార్లలో స్నేహితులతో కలసి మద్యం సేవించడం) అనేది ఢిల్లీలో ఓ సాధారణ అంశమే. అంతేకాదు, ఎక్కువ మంది మందుబాబులు వైన్ షాపుల వద్ద లేదా ఫుడ్ కోర్టుల వద్ద కార్లు ఆపి, అందులోనే మద్యం సేవిస్తుంటారు. బార్లలో అధిక రేట్లు ఉండటంతో ఎక్కువ మంది ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. దీంతో, ఈ పద్ధతికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది.

More Telugu News