: ‘టాటా గ్రూప్’పై మిస్త్రీ తొలగింపు ప్రభావం.. టాటా షేర్ల నష్టం 21,000 కోట్లు

‘టాటా గ్రూప్’ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీ తొలగింపు ప్రభావం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ముఖ్యంగా ఆ గ్రూప్ కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. నిన్న రూ.10,700 కోట్లు నష్టపోగా, ఈరోజు మరో రూ.10,000 కోట్లు నష్ట పోవడంతో, మొత్తం నష్టం సుమారు రూ.21,000 కోట్లకు చేరింది. టాటా గ్రూప్ కంపెనీల ఏయే షేర్లు ఎంత శాతం నష్టం పోయాయంటే.. టాటా మోటార్స్ షేర్లు 4.27%,టాటా స్టీల్ 4.01%,టాటా పవర్ 2.06%, టాటా గ్లోబల్ బేవరేజెస్ 3.10%, టాటా కెమికల్స్ 2.83%, టాటా కమ్యూనికేషన్స్ 2.68 %, టాటా స్పాంజ్ ఐరన్ 0.57%, టాటా కాఫీ 0.42 %, టీసీఎస్ 0.07%, టాటా మెటాలిక్ 3.85%, టాటా ఎలెక్సి 3.15 శాతం నష్టపోయాయి.

More Telugu News