: నకిలీ విత్తనాలు విక్రయిస్తే జైలుకే!: ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

నకిలీ విత్తనాలు విక్రయించే వారు జైలుకు వెళ్లక తప్పదని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని అన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించిన రెండు సంస్థల యజమానులను ఇప్పటికే అరెస్టు చేశామని అన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టే నిమిత్తం విత్తన చట్టంలో మార్పులు తీసుకువస్తామని చెప్పారు. రూ.200 కోట్లతో రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేయనున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రత్తిపాటి తెలిపారు.

More Telugu News