: సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా... ఓటమిని అడ్డుకోగలరా?

రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా పేలవ ప్రదర్శన చేస్తోంది. తొలుత ఫీల్డింగులో టీమిండియా బౌలర్లు కివీస్ బ్యాట్స్ మన్ ను 260 పరుగులకు కట్టడి చేశారు. అనంతరం 261 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కేవలం 19 పరుగులకే రోహిత్ శర్మ (11) వికెట్ కోల్పోగా, టెస్టు కెప్టెన్, ఛేజింగ్ రారాజు విరాట్ కోహ్లీ (45) విఫలమయ్యాడు. అనంతరం రహానే (57) కీలక సమయంలో అవుటయ్యాడు. అనంతరం కెప్టెన్ ధోనీ (11) నీషమ్ వేసిన అద్భుతమైన బంతికి పెవిలియన్ చేరాడు. ఈ దశలో అక్షర్ పటేల్ కు జత కలిసిన మనీష్ పాండే కొలిచినట్టు కొట్టిన షాట్ ను న్యూజిలాండ్ ఆటగాడు లాంథమ్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో నిరాశగా పాండే (12) వెనుదిరిగాడు. తరువాతి బంతిని అంచనా వేయడంలో తడబడ్డ కేదార్ జాదవ్ (0) డకౌట్ అయ్యాడు. దీంతో అక్షర్ పటేల్ (12) కు హార్డిక్ పాండ్య (3) జత కలిశాడు. దీంతో 34 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. టీమిండియా టాపార్డర్ పతనాన్ని మూడు వికెట్లతో టిమ్ సౌతీ శాసించగా, నషీమ్ రెండు వికెట్లు తీసి అతనికి చక్కని సహకారమందించాడు. దీంతో టీమిండియా టెయిలెండర్లు పోరాడి కివీస్ విజయాన్ని అడ్డుకోగలరా? అన్నది చూడాలి.

More Telugu News