: 19 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో 261 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (11), అజింక్యా రహనే (17) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. 5వ ఓవర్ తొలి బంతిని టిమ్ సౌతీ అవుట్ స్వింగర్ గా సంధించాడు. దానిని షాట్ గా మలిచే ప్రయత్నం చేసిన రోహిత్ శర్మ వాట్లింగ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 19 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం రహనేకు కోహ్లీ జత కలిశాడు. కోహ్లీ (10) నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించగా, రహానే దూకుడు పెంచాడు. దీంతో టీమిండియా 8 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది.

More Telugu News