: ఆకట్టుకున్న కివీస్... టీమిండియా లక్ష్యం 261

రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. టీమిండియా బౌలర్ల ముందు 260 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఓపెనర్లు మార్టిన్‌ గుప్తిల్‌ (72), టామ్‌ లాథమ్‌ (39) శుభారంభం ఇవ్వగా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (41), రాస్ టేలర్ (35) నిలకడ ప్రదర్శించారు. అయితే భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. నీషమ్ (6), వాట్లింగ్ (14), ఆన్టన్ డెవ్విచ్ (11) స్కోరు బోర్డును పరుగులెత్తించే క్రమంలో పెవిలియన్ చేరారు. చివర్లో శాంటనర్ (17), టిమ్ సౌతీ (9) మెరుపులు మెరిపించే ప్రయత్నం చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అమిత్ మిశ్రా రెండు వికెట్లతో రాణించగా, అక్షర్ పటేల్, హార్డిక్ పాండ్య, ధావల్ కులకర్ణి, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ తీశారు. కాసేపట్లో 261 పరుగుల విజయ లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించనుంది.

More Telugu News