: అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై సల్మాన్ బాడీగార్డుపై కేసు నమోదు

ముంబయిలోని ఒక పబ్ లో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డు షేరాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పబ్ లోని వ్యక్తులను అసభ్యకర పదజాలంతో దూషించడమే కాకుండా, వారితో దురుసుగా వ్యవహరించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అంధేరి శివారులోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో షేరాపై ఈరోజు కేసు నమోదు చేశారు. కాగా, ఎంతో కాలంగా సల్మాన్ కు బాడీగార్డ్ గా షేరా వ్యవహరిస్తున్నాడు.

More Telugu News