: వారెవ్వా... 95 ఏళ్లకు స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు!

95 ఏళ్ల వయసులో స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించి, ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు ఎడ్వర్డ్ హ్యుచిన్ సన్. పెన్సిల్వేనియాకు చెందిన ఆయన... 1939లో ఫైర్ డిపార్ట్ మెంటులో చేరారు. ఉద్యోగంలో చేరిన 14 ఏళ్లకు (1953లో) ఫైర్ చీఫ్ గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి అతన్ని తప్ప ఫైర్ చీఫ్ గా మరెవరినీ ఎన్నుకోలేదు. ప్రతిసారీ ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో, 63 ఏళ్లుగా ఫైర్ చీఫ్ గా ఆయనే వ్యవహరిస్తున్నారు. తన పదవీ కాలంలో ఎన్నో ప్రమాదకర ఫైర్ యాక్సిడెంట్లను ఆయన ఎదుర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో సైతం సేవలందించారు. ఈ వయసులో కూడా చీఫ్ గా ఆయనే కొనసాగాలంటూ ఫైర్ డిపార్ట్ మెంట్ పట్టుబట్టింది. కానీ, తన వయసును దృష్టిలో పెట్టుకొని చీఫ్ గా కొనసాగేందుకు ఆయన నిరాకరించారు. ఇప్పటికే ఎంతో కాలం సేవలందించానని, ఇక కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటూ ఆయన కోరారు. దీంతో, ఆయన నిర్ణయానికి గౌరవం ఇస్తూ, ఎడ్వర్డ్ లాంటి శక్తి, సామర్థ్యాలున్న మరో చీఫ్ ను ఎంపిక చేసే ప్రక్రియను ఆరంభించారు.

More Telugu News