: యూ ట్యూబ్ ఛానెల్ సాయంతో తన ప్రియుడు ఎంత నిగ్ర‌హంగా ఉన్నాడో కనిపెట్టిన యువతి!

త‌న‌ ప్రియుడిపై ఆమెకు అనుమానం క‌లిగింది. త‌న రాకుమారుడి బుద్ధి ఎలాంటిదో ప‌రీక్షించాల‌నుకుంది. మ‌రో అమ్మాయి క‌న‌ప‌డితే ఆమె వెంట త‌న ప్రియుడు వెళ్లిపోతాడో.. లేదో చూడాల‌నుకుంది. ఓ పోర్న్‌ నటిని త‌న ప్రియుడి వ‌ద్ద‌కు పంపించి ఆయ‌నను ఆక‌ర్షించేలా చేయమంది. తన ప్రేమికుడు ఎంత నిగ్ర‌హంగా ఉన్నాడో క‌నిపెట్టింది. ఓ పాశ్చాత్య దేశంలో జ‌రిగిన ఈ ఘ‌టన ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. తమ భాగస్వామి మీద అనుమానం ఉన్నవారు ఎవ‌ర‌యినా ఇటువంటి ప‌రీక్ష పెట్ట‌డానికి త‌మను ఆశ్ర‌యించ‌వ‌చ్చని యూట్యూబ్‌లో ‘టు క్యాచ్‌ ఏ చీటర్ ఛానెల్’ ప్ర‌క‌టించింది. ఇటువంటి పరీక్షలు పెట్టి, అందుకు సంబంధించిన‌ వీడియోలను త‌మ ఛానెల్‌లో ఉంచుతోంది. ఈ ఛానెల్‌నే ఆ యువ‌తి ఆశ్రయించి, తన ప్రియుడు గురించి ఆరా తీసింది. ‘టు క్యాచ్‌ ఏ చీటర్ ఛానెల్‌’ సాయంతో ఓ పోర్న్‌స్టార్‌ను త‌న ప్రియుడి వ‌ద్ద‌కు పంపించింది. అక్క‌డ ఉంచిన కెమెరాలు ఆ దృశ్యాల్ని చిత్రీకరిస్తుండగా ఆ యువ‌కుడిని ఆమె ఆక‌ర్షించ‌డానికి య‌త్నించింది. కానీ, ఆ యువ‌కుడు లొంగిపోలేదు. అయినా అత‌డి వెంట‌ప‌డింది. ఎంతో నిగ్ర‌హంగా ఉన్నాడు. ఈ దృశ్యాల్ని చూసిన అతడి ప్రియురాలికి అనుమానం తీరిపోయింది. త‌న ప్రియుడు మంచివాడేన‌ని గుర్తించింది. వెంటనే అత‌డికి ఫోన్‌ చేసి తానే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇలా చేయిస్తున్నాన‌ని చెప్పింది. దీంతో అతడు తనకి ప‌రీక్ష పెట్టినందుకు కస్సుమని, ఫోన్‌ పెట్టేశాడు. చివరికి త‌న ప్రియుడిపై ఇటువంటి ప్ర‌యోగం చేసినందుకు ఆమె ప‌శ్చాత్తాపం చెందింది.

More Telugu News