: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. వాయుగుండం తుపానుగా మారడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. విశాఖ తీరానికి తూర్పు దిశలో 760 కిలోమీటర్ల దూరంలో కీంద్రీకృతమైన వాయుగుండం ఏపీలోనే తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో రేపటి నుంచి కోస్తాలో, ఎల్లుండి నుంచి రాయలసీమ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

More Telugu News