: మిస్టర్‌ ఆసియాగా ట్యాంకర్‌ డ్రైవర్‌ బాలకృష్ణ

ఫిలిప్పీన్స్‌లో జ‌రిగిన ఫిలి-ఏసియా బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బెంగళూరుకు చెందిన జి.బాలకృష్ణ అనే ట్యాంకర్‌ డ్రైవర్ ‘మిస్ట‌ర్ ఆసియా’ టైటిల్ విజేతగా నిలిచాడు. గ‌తంలో జ‌ర్మ‌నీలో నిర్వ‌హించిన‌ పోటీలోనూ అండర్‌-24 కేటగిరిలో మిస్టర్‌ యూనివర్స్‌గా బాల‌కృష్ణ టైటిల్ గెలుపొందాడు. అనంత‌రం 2014 లో ఏథెన్స్‌లో జరిగిన పోటీల్లోనూ అండర్‌ -24 కేటగిరిలో మిస్టర్‌ వరల్డ్‌గా నిలిచాడు. బాడీబిల్డింగ్‌లో ఎన్నో ప‌తకాలు సాధించిన బాల‌కృష్ణ‌ బెంగళూరు ఆర్నాల్డ్‌గా పేరు తెచ్చుకున్నాడు. బాల్యంలోనే తండ్రిని పోగొట్టుకున్న బాలకృష్ణ తల్లి పర్వతమ్మ, సోదరుడు రాజేష్‌ల ఆల‌నాపాల‌న‌తో పెరిగాడు. ముంబయికి చెందిన సంగ్రామ్‌ చౌగ్లా, పంజాబ్‌కు చెందిన మునిష్‌ కుమార్‌ల వ‌ద్ద బాడీ బిల్డింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. జిమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా, వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూనే అంత‌ర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నాడు.

More Telugu News