: సెకండ్ వరల్డ్ వార్ తరువాత తొలిసారి కలిసిన జపాన్, బ్రిటీష్ యుద్ధ విమానాలు

బ్రిటన్ కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ టైఫూన్ యూరో ఫైటర్ యుద్ధ విమానాలు జపాన్ నేలపై కాలుమోపాయి. జపాన్ యుద్ధ విమానాలతో కలసి సంయుక్త విన్యాసాల్లో ఇవి పాల్గొంటుండగా, రెండో ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా బ్రిటన్, జపాన్ యుద్ధ విమానాలు పక్కపక్కన కనిపించడం ఇదే తొలిసారి. ఈ సంయుక్త విన్యాసాలు మిసావా ఎయిర్ బేస్ లో నేడు ప్రారంభమయ్యాయి. యూఎస్ మినహా మరో దేశపు యుద్ధ విమానాలతో జపాన్ విన్యాసాలు చేయడం కూడా ఇదే తొలిసారి. జపాన్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న మిత్సుబిషి ఎఫ్-2 యుద్ధ విమానాలు, సీ-17 గ్లోబ్ మాస్టర్ సహా పలు రకాల ఎయిర్ క్రాఫ్ట్స్ తమ సత్తాను చాటనున్నాయి. ఇరు దేశాల మధ్యా మరింత స్నేహబంధం పెరిగేందుకు ఈ కార్యక్రమం సహకరిస్తుందని భావిస్తున్నట్టు జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ వ్యాఖ్యానించింది.

More Telugu News