: మీ వల్ల కాకుంటే మేం రంగంలోకి దిగుతాం.. ఉగ్రస్థావరాల ధ్వంసంపై పాక్‌ను హెచ్చరించిన అమెరికా

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలపై ఆ దేశ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) సరైన చర్యలు తీసుకోవడం లేదని అమెరికా పేర్కొంది. ఉగ్రవాద సంస్థలపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, లేదంటే తాము నేరుగా రంగంలోకి దిగి ఉగ్రవాదులను ఏరివేస్తామని హెచ్చరించింది. ఈ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. సమస్యంతా ప్రభుత్వంతోనే ఉందని, దళాలు మొత్తం ప్రభుత్వం చేతిలో ఉండడంతోనే ఈ సమస్య తలెత్తుతోందని కౌంటెరింగ్ ద ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజమ్‌కు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అదామ్ ఎస్‌జుబిన్ పేర్కొన్నారు. ఉగ్రసంస్థలపై చర్యలు తీసుకునేందుకు ఐఎస్ఐ అంత ఆసక్తి చూపించడం లేదని తెలిపారు. ‘‘పాకిస్థాన్ కేంద్రంగా చెలరేగిపోతున్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పాక్‌ను కోరుతున్నాం. ఈ విషయంలో వారికి మా సాయం ఉంటుంది. అయితే పాక్ కనుక ఉగ్రవాదుల ఏరివేతలో విఫలమైతే రంగంలోకి దిగేందుకు అమెరికా ఏ మాత్రం సంశయించదు’’ అని ఎస్‌జుబిన్ తేల్చి చెప్పారు.

More Telugu News