: బీసీసీఐ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన గంగూలీ, అజార్

డీఆర్ఎస్ (అంపైర్ సమీక్ష పద్ధతి)ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు మాజీ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ నిర్ణయం ఆహ్వానించదగ్గదని టీమిండియా మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మొహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. ఇప్పటికే భారత్ డీఆర్ఎస్ విధానాన్ని వాడుకోవాల్సిందని... దీన్ని వాడుకోకపోవడం వల్ల అనేక మ్యాచ్ లను ఇండియా తృటిలో కోల్పోవాల్సి వచ్చిందని అజార్ అన్నాడు. కొంచెం ఆలస్యమైనా, బీసీసీఐ మంచి నిర్ణయాన్ని తీసుకుందని ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజార్ తెలిపాడు. ఇదే విషయంపై గంగూలీ మాట్లాడుతూ, తాను ఆడుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు డీఆర్ఎస్ పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయని... ప్రస్తుత విధానం అన్నిటికన్నా మెరుగ్గా ఉందని అన్నాడు. ఇంగ్లండ్ సిరీస్ తో డీఆర్ఎస్ ను పరీక్షించాలనే నిర్ణయం ఆహ్వానించదగ్గదని చెప్పాడు.

More Telugu News