: అమెరికా చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి: చైనా

అమెరికా చర్యలపై చైనా మరోసారి బహిరంగంగా మండిపడింది. తమ అధీనంలో ఉన్న దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి అమెరికా యుద్ధ నౌక వచ్చిందంటూ ఆరోపించింది. ఇది చాలా సీరియస్ అంశం అని... తమను రెచ్చగొట్టేలా అమెరికా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా ప్రాదేశిక జలాల్లోకి అమెరికా నౌక ప్రవేశించిన తర్వాత, తమకు చెందిన రెండు నావల్ వెసెల్స్ ఆ యుద్ధ నౌకను హెచ్చరించాయని చైనా రక్షణ శాఖ వెల్లడించింది. అమెరికా చర్యలు తమ దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేలా ఉన్నాయని తెలిపింది. చైనా చట్టాలు, అంతర్జాతీయ చట్టాలకు అమెరికా తూట్లు పొడుస్తోందని ఆరోపించింది. ఈ జలాల్లో ఉన్న పారాసెల్ ద్వీపం తమదే అని చైనా వాదిస్తోంది. అయితే, ఈ దీపం తమదే అని వియత్నాం, తైవాన్ లు కూడా వాదిస్తున్నాయి.

More Telugu News