: నదీ జలాల వివాదంపై సీపీఐ నారాయణ ఆగ్ర‌హం

నదీ జలాల వివాదంపై సీపీఐ నేత నారాయణ ఈ రోజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... కావేరీ జలాల వివాదంపై కేంద్రం కర్ణాటకకు అనుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు. కావేరీ జలాల అంశంలో నాలుగు రాష్ట్రాల కోసం కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. కేంద్రం చిత్త‌శుద్ధి లేకుండా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కావేరీ జ‌లాల అంశంలో తెలుగు రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతోందని అన్నారు. చంద్ర‌బాబు, కేసీఆర్‌ల‌కు చిత్త‌శుద్ధి ఉంటే మోదీని నిల‌దీయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఏ వివాద‌మైనా బీజేపీ మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌ వైపే నిలుస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి ఓట్లు వ‌స్తాయ‌ని, ఏపీ, తెలంగాణ‌ల్లో రావు కాబ‌ట్టి వారు తెలుగురాష్ట్రాల‌కు న్యాయం చేయ‌రని వ్యాఖ్యానించారు.

More Telugu News