: ‘కిక్’లో వాహనాలు నడిపి.. రూ.2 కోట్లు సమర్పించుకున్న మందుబాబులు!

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న మందుబాబులకు హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు ‘కిక్’ వదిలిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు 20 వరకు డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి నుంచి పోలీసులు ఏకంగా రూ. 2,01,17,100 జరిమానాల రూపంలో వసూలు చేశారు. ప్రత్యేక తనిఖీల్లో ఇప్పటి వరకు 13,447 మంది చిక్కారని, వీరిలో 6,245 మందికి ఎర్రమంజిల్‌లోని కోర్టులు శిక్షలు విధించినట్టు ట్రాఫిక్ చీఫ్ జితేందర్ శుక్రవారం తెలిపారు. అలాగే ఇప్పటి వరకు 10,065 ద్విచక్ర వాహనాలు, 983 త్రీ వీలర్లు, 2,115 తేలికపాటి వాహనాలు, 284 ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. మద్యం తాగి వాహనాలు డ్రైవ్ చేస్తే కఠిన శిక్షలు తప్పవని జితేందర్ హెచ్చరించారు.

More Telugu News