: చైనాతో బంధం కోసం అమెరికాకు టాటా చెప్పేసిన ఫిలిప్పీన్స్

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు వుండరంటారు. దీనిని నిజం చేస్తూ ఫిలిప్పీన్స్ ఇప్పుడు తన సుదీర్ఘ మిత్రుడు అమెరికాకు టాటా చెప్పేసింది. అదే సమయంలో శత్రుత్వాన్ని వీడి చైనాకు స్నేహ హస్తాన్ని చాపింది. దీనిని చైనా నెరపిన దౌత్యపరమైన ఘన విజయంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్తే అమెరికాతో తమ చిరకాల బంధాన్ని తెంచుకుంటున్నామని ప్రకటించారు. ఇటీవలి కాలంలో మాదకద్రవ్యాల స్మగ్లర్లపై యుద్ధం పేరిట ఫిలిప్పీన్స్ విచక్షణారహితంగా వందలాది మందిన హతమార్చడాన్ని అమెరికా ఖండించింది. దాంతో అమెరికా అధ్యక్షుడు ఒబామాపై బహిరంగంగానే విమర్శలు గుప్పించిన ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్తే అమెరికాకు దూరమైనట్టు చైనాలో ఉండగానే ప్రకటించారు. దీనికి తోడు చైనాతో ఆయన 13 ఒప్పందాలు చేసుకున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌ తో సమావేశమైన సందర్భంగా రోడ్రిగో మాట్లాడుతూ... ‘మనం పొరుగువారం, రక్త సంబంధీకులం’ అంటూ బంధుత్వాన్ని కలిపారు. ‘ఇకపై అమెరికా వెళ్లను. అక్కడ మేం అవమానాలకు గురవుతున్నాం’ అన్నారు. కాగా, దక్షిణ చైనా సముద్రం విషయంలో ఫిలిప్పీన్స్ కు, చైనాకు మధ్య తీవ్ర విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది.

More Telugu News