: మైక్రోసాఫ్ట్ 11వ సెంటర్ ఏపీలోనే... స్వయంగా వెల్లడించిన చంద్రబాబు

ప్రపంచ ప్రఖ్యాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ తన 11వ డెవలప్ మెంట్ సెంటర్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయనుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. యూఎస్ లో 500 ఐటీ కంపెనీలు పనిచేస్తుండగా, వాటిల్లో 8 ఇప్పటికే ఏపీకి వచ్చాయని, మరో 32 కంపెనీలు రానున్నాయని, వీటి రాక తరువాత విశాఖలోని 2 వేల మందికి ఐటీ ఉద్యోగాలు లభించనున్నాయని ఆయన అన్నారు. ఇక్కడికి వస్తున్న కంపెనీలను చూసి మరిన్ని కంపెనీలు వస్తాయని అంచనాలు వేసిన ఆయన, భవిష్యత్తులో సాంకేతిక నిపుణులను ఈ-ప్రగతిలో భాగం చేస్తామని తెలిపారు. విశాఖపట్నంలో శాఖలను ఏర్పాటు చేస్తున్న కంపెనీలన్నీ రూ. 10 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకూ టర్నోవర్ ను నమోదు చేస్తున్నవే కావడం ఆనందంగా ఉందని తెలిపారు.

More Telugu News