: నవాజ్‌ షరీఫ్‌కి నోటీసులు జారీచేసిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు

కొన్ని నెలల క్రితం పనామా పేపర్స్ లో వెల్లడించిన ప్రపంచ ప్రముఖుల అక్రమ ఆస్తుల వివరాల్లో పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్ పేరు కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఈ రోజు ఆయ‌న‌కు ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. పనామా పేపర్స్‌లో షరీఫ్‌ ఆస్తుల వివరాలు వెల్ల‌డ‌యిన అనంత‌రం పాక్‌కు చెందిన తెహ్రిక్‌-ఎ-ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఆగస్ట్ 28 న త‌మ దేశ ప్ర‌ధానిపై కేసు వేశారు. ష‌రీఫ్ అడ్డంగా దొరికిపోయాడని ఆయ‌న పేర్కొన్నాడు. దీంతో పాక్ ప్ర‌ధానితో పాటు పలువురికి ఆ దేశ అత్యున్నత న్యాయ‌స్థానం నోటీసులు జారీచేసింది. అనంత‌రం కేసును రెండు వారాల పాటు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

More Telugu News