: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్ధం?

తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత, పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్ధమవుతోంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా నవంబర్ 2న ఇస్లామాబాద్ ముట్టడి పేరుతో భారీ ఆందోళనకు ఆయన పిలుపునిచ్చారు. పనామా పేపర్లలో నవాజ్ కుటుంబసభ్యులు నల్లధనం దాచుకున్నారని వెల్లడైనా చర్యలు తీసుకోకపోవడం, కశ్మీర్ విషయంలో షరీఫ్ ఏం చేయలేకపోవడం వంటి కారణాలతో ఇస్లామాబాద్ ముట్టడికి ఇమ్రాన్ పిలుపునిచ్చారు. లక్షమందితో దేశ రాజధానిని స్తంభింపజేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇస్లామాబాద్ ముట్టడి జరిగితే పరిస్థితులు మరింత దిగజారుతాయని షరీఫ్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో, ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా జరగకుండా ఆపాలని యత్నిస్తోంది. ఈ క్రమంలో, ఇమ్రాన్ ఖాన్ తో పాటు, ఆయన పార్టీకి చెందిన సీనియర్ నేతలను ముందస్తుగానే అరెస్ట్ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు పాక్ మీడియా సంస్థ 'ది న్యూస్' తెలిపింది. ఈ అరెస్ట్ వార్తలపై స్పందించిన ఇమ్రాన్... ఇలాంటి బెదిరింపులకు తాము భయపడమని అన్నారు. రాజ్యాంగబద్ధమైన తమ హక్కును కాలరాసి, ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేస్తే... తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

More Telugu News