: చరిత్రలో తొలిసారి... జమ్మూ కాశ్మీర్ లో సైనిక బలాన్ని చూపుతున్న ఇండియా-చైనా

చరిత్రలో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ పరిధిలోని లడఖ్ ప్రాంతంలో ఇండియా, చైనాలు సంయుక్త సైనిక విన్యాసాలు చేయనున్నాయి. ఇరుదేశాల సైనికుల మధ్య సత్సంబంధాలు, మరింత బలోపేతమైన ద్వైపాక్షిక సంబంధాలే లక్ష్యంగా నేడు రెండు దేశాల సైనికులూ కలసి సరిహద్దు సమీప గ్రామాల్లో పలు రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భూకంపాలు ఏర్పడినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల తరలింపు, వైద్య అవసరాలు తీర్చడం వంటి అంశాలు ఈ విన్యాసాల్లో భాగం కానున్నాయి. చైనా సైన్యంలోని మాల్డో గారిసన్ విభాగానికి చెందిన జవాన్లు ఈ విన్యాసాల్లో పాలు పంచుకోనున్నారు. కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కూడా ఇదే తరహా విన్యాసాలు జరిగాయి. అయితే, అవి చైనా వైపు జరుగగా, ఈ దఫా వాస్తవాధీన రేఖకు భారత వైపు జరగనున్నాయి. భారత జవాన్లకు బ్రిగేడియర్ ఆర్ఎస్ రామన్ నేతృత్వం వహించనుండగా, చైనా సైన్యానికి సీనియర్ కల్నర్ ఫాన్ జున్ నాయకత్వం వహించనున్నారు.

More Telugu News