: ఫుల్ టెన్షన్ లో లలిత్ మోదీ, విజయ్ మాల్యా?

భారత్ లో ఆర్థిక నేరాలకు పాల్పడి లండన్ పారిపోయి తలదాచుకున్న ఐపీఎల్ రూపకర్త లలిత్ మోదీ, ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా తీవ్ర ఉత్కంఠ అనుభవిస్తున్నారు. 2002లో గుజరాత్‌ లో గోద్రా ఘటన అనంతరం జరిగిన అల్లర్లలో నిందితుడైన సమీర్‌ వినుభాయ్‌ పటేల్‌ ను గుజరాత్‌ పోలీసులు బ్రిటన్ నుంచి స్వదేశానికి తీసుకువచ్చారు. 1992లోనే ఇరు దేశాల మధ్య నేరస్థుల మార్పిడికి ఒప్పందం కుదిరినప్పటికీ ఇన్నేళ్లకు తొలిసారిగా తమ దేశంలో తలదాచుకుంటున్న భారత్‌ కు చెందిన నేరస్థుడిని బ్రిటన్ అప్పగించడం విశేషం. సమీర్‌ ను కొన్ని రోజుల కిందటే యూకే పోలీసులు అరెస్టుచేశారు. ఆ దేశ హోం సెక్రటరీ అంబర్‌ రూడ్‌ అతన్ని భారత్‌కు పంపేందుకు అంగీకరించడంతో స్వదేశానికి తరలించారు. దీంతో ఈ ఒప్పందం ప్రకారం బ్రిటన్ తమను కూడా భారత్ కు అప్పగిస్తుందని ఆర్థిక నేరాలకు పాల్పడి, అక్కడ తలదాచుకున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో లలిత్‌మోదీ, రవిశంకరన్‌, టైగర్‌ హనీఫ్‌ (గుజరాత్‌ పేలుళ్ల నిందితుడు), నదీం సైఫీ (గుల్షన్‌కుమార్‌ హత్యకేసులో నిందితుడు), రేమండ్‌ వర్లె తదితరులు ఉన్నారు. ఈ మధ్య పోర్చుగల్ లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ అబుసలెంను ఆ దేశం భారత్ కు అప్పగించిన సంగతి తెలిసిందే.

More Telugu News