: కారు తయారుచేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్న రిక్షా పుల్లర్‌ కొడుకు

మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టిన పందొమ్మిదేళ్ల ప్రేమ్‌ ఠాకూర్ అనే యువ‌కుడు కారు త‌యారు చేసి అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంటున్నాడు. ఎవ‌రి సాయం లేకుండా, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్ కూడా చ‌ద‌వ‌కుండా ఆ యువ‌కుడు కారుని త‌యారు చేయడం ప‌ట్ల అంద‌రూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ముంబయికి చెందిన ఈ కుర్రాడు ప్ర‌స్తుతం బీ.కాం చదువుతున్నాడు. బాల్యం నుంచే కార్లపై ఎంతో ఆసక్తిని క‌న‌బ‌రిచేవాడు. ఆ మ‌క్కువే అత‌డు కార్లను తయారు చేసే వ‌ర‌కు తీసుకెళ్లింది. ఒక బగ్గీకారును తయారుచేశాడు. ఈ కారుని పాత సామాన్లతో రూపొందించి రంగులు వేశాడు. దానిని నడుపుతూ వీధుల్లో తిరుగుతున్నాడు. రిక్షా పుల్లర్ అయిన‌ తండ్రి ప్రేమ్ తనయుడు ఠాకూర్ కు 12వ యేట ఓ కంప్యూటర్‌ కొనిచ్చాడు. అందులో ఇంట‌ర్నెట్ ద్వారా కార్ల త‌యారీ అంశాలను చ‌దువుకునేవాడు. కొడుకు ఆసక్తిని తండ్రి ప్రోత్స‌హించాడు. కారు కోసం మొత్తం రెండున్నల లక్షల వరకు ఖర్చయింది. ఇంటర్నెట్ తో పాటు త‌న‌ బామ్మ సహా ఇంట్లో వాళ్లందరూ త‌న‌కు సహకరించటంతోనే కారుని త‌యారు చేశాన‌ని, భవిష్యత్తులో మ‌రిన్ని విజ‌యాలు సాధిస్తాన‌ని చెప్పాడు ప్రేమ్ కుమార్‌. ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మంచి పేరుతెచ్చుకుంటాన‌ని చెప్పాడు.

More Telugu News