: చేపల కోసం వలవేస్తే... కొండచిలువ చిక్కింది

చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. చేపల కోసం వల వేస్తే ఏకంగా కొండచిలువే చిక్కింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, నాయకన్ గూడెంకు చెందిన షేక్ మన్సూర్ అనే మత్స్యకారుడు నిన్న సాయంత్రం పాలేరు జలాశయంలో చేపల కోసం వల వేసి ఇంటికి వెళ్లాడు. ఈ ఉదయం వచ్చి వలను లాగి చూడగా అందులో కొండచిలువ కనిపించింది. అది సుమారు 7 అడుగుల పొడవు ఉంది. దీంతో, ఒక్కసారిగా షాక్ కు గురైన మన్సూర్ తోటి మత్స్యకారులకు ఈ విషయాన్ని తెలిపాడు. ఆ తర్వాత అందరూ కలసి కొండచిలువను చంపేశారు.

More Telugu News