: షాపింగ్ మాల్ కి వెళ్తున్నారా? అయితే ఓసారి ఈ వీడియో చూడండి!

షాపింగ్ మాల్స్ లోపలికి వెళ్లి అక్కడి వస్తువుల పనితీరును స్వయంగా తెలుసుకోవడం కొంత మందికి అలవాటు. ఇలాంటి అలవాటు కలిగిన ఓ వ్యక్తి చైనాలోని ఓ పెద్ద షాపింగ్ మాల్ కు వెళ్లి, అక్కడ షో కోసం పెట్టిన ఖరీదైన టీవీలను చూసి, షాక్ తిన్నాడు. వివరాల్లోకి వెళ్తే... ఇంగ్లండ్ లోని కార్నివాల్ లో పెద్ద పట్టణమైన సెయింట్ ఆస్టెల్ లోని హెచ్ బీహెచ్ షోరూంలోకి ఓ వినియోగదారుడు వెళ్లాడు. అక్కడి వస్తువులను చూస్తూ, ఆనందించిన ఆ వ్యక్తి షో కోసం పెట్టిన ఖరీదైన టీవీలను చూశాడు. నాలుగు టీవీల మధ్యకు వెళ్లిన ఆ వ్యక్తి ఒక టీవీ బటన్ ను నొక్కాడు. అయితే, ఆ టీవీలను ఒకదానికొకటి దగ్గర దగ్గరగా పెట్టడంతో అతని చేయితగలగానే అది దాని వెనుకనున్న టీవీపై పడింది. దాంతో ఈ రెండు టీవీలు కిందపడి పగిలిపోయాయి. దీంతో షాక్ కు గురైన అతను 'అయ్యో' అనుకుంటూ వెనక్కి జరిగాడు. ఆ వెంటనే అతని చేయి తగిలి ఆ వెనక ఉన్న రెండు టీవీలు పడిపోయాయి. ఆ పగిలిపోయిన ఒక్కో టీవీ ఖరీదు 4 లక్షల రూపాయలు కావడం విశేషం. పగిలిపోయిన టీవీల ధరను అతని నుంచి వసూలు చేసినట్టు తెలుస్తోంది. కనుక షాపింగ్ మాల్స్ లోపలికి వెళ్లాక ఆయా వస్తువులను తాకకుండా, సేల్స్ పర్సన్స్ ద్వారా తెలుసుకోవడమే ఉత్తమం అని ఆ షాపింగ్ మాల్ అప్ లోడ్ చేసిన వీడియో చెబుతోంది. మీరు కూడా ఆ వీడియోను చూడండి.

More Telugu News