: ఎల్ఓసీ వద్ద ఏ తరహా దాడులనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం: కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్

వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ) వద్ద ఏ తరహా దాడులనైనా సరే తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శ్రీనగర్ కు చెందిన 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ లోని బోనియార్ లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో పాక్ సైన్యం, ఉగ్రవాదులు ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినా తాము తిప్పికొడతామని, సమర్థంగా ఎదుర్కొంటామని అన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి చొరబాట్లను చాలా వరకు భారత ఆర్మీ భగ్నం చేస్తోందని అన్నారు. ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ గురించి ప్రశ్నించగా.. ఈ విషయంలో భారత సైన్యం, రాజకీయ అధినాయకత్వం చెప్పాల్సింది అంతా చెప్పేసిందని అన్నారు. కాశ్మీర్ లోయలో జరుగుతున్న అల్లర్లకు కారణం తప్పుదోవ పట్టిన అక్కడి యువకులేనని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

More Telugu News