: రేప్ చేసింది ఒకడైతే... నిర్దోషికి ఉరిశిక్ష వేయించాడు!

రేప్ చేసింది ఒకడైతే, ఆ కేసులో నిర్దోషికి ఉరిశిక్ష పడేలా చేశాడతను. దీనికి తోడు అక్రమంగా ఆయుధాలను అమ్మడం, అక్రమంగా డబ్బు సంపాదించడం వంటి కేసుల్లో ఆ సీనియర్ పోలీస్ అధికారికి ఏకంగా 18 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. వివరాల్లోకి వెళ్తే, చైనాలోని హోహాట్ లో మాజీ పోలీస్ డిప్యూటీ హెడ్ ఫెంగ్ ఝిమింగ్ దాదాపు రూ. 38 కోట్ల లంచం తీసుకున్నాడని, నాలుగు తుపాకులను అక్రమంగా అమ్మాడని కోర్టులో తేలింది. దీనికి తోడు, ఓ హత్య కేసులో విచారణాధికారిగా వ్యవహరించిన సమయంలో నిర్దోషికి ఉరిశిక్ష పడేలా చేశాడని నిరూపితమైంది. దీంతో, కోర్టు అతనికి కఠిన శిక్షను విధించింది. ఓ యువతిపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో హూజ్జిత్ అనే యువకుడిపై కేసు నమోదైంది. వాస్తవానికి హూజ్జిత్ ఈ నేరం చేయలేదు. అయినప్పటికీ, విచారణ జరిపిన ఫెంగ్ మాత్రం హూజ్జితే ఈ నేరానికి పాల్పడ్డాడని... అతనికి ఉరి శిక్ష పడేలా చేశాడు. ఆ తర్వాత 2014లో హూజ్జిత్ నిర్దోషిగా తేలింది. కానీ, అప్పటికే అతడిని ఉరి తీశారు. దీంతో, చైనాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే, విచారణకు ఆదేశించగా ఫెంగ్ చేసిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

More Telugu News