: 1138 కోట్ల రూపాయల 'పచ్చ'కొండ దొరికింది

మయన్మార్‌ లో గని కార్మికుల తవ్వకాల్లో 1,75,000 కిలోల బరువు, 9 అడుగుల ఎత్తు, 18 అడుగుల పొడవు, వెడల్పు ఉన్న ‘పచ్చ’కొండ దొరికి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రపంచ దేశాల్లో మయన్మార్ లోనే 'పచ్చ' అధికంగా లభ్యమవుతుంది. ఈ నేపథ్యంలో కచిన్‌ లోని మారుమూల ప్రాంతంలో అరుదైన రత్నాల కోసం గని కార్మికులు తవ్వకాలు జరుపుతుండగా ఈ పచ్చ కొండ బయటపడింది. దీని విలువ బహిరంగ మార్కెట్ లో సుమారు 1,138 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, చైనాలో జేడ్‌ బుద్ధ ప్యాలెస్ లోని 2,60,000 కిలోల బరువున్న పచ్చరాయి విగ్రహం తరువాత లభ్యమైన పచ్చ రాళ్లలో ఇదే ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పచ్చరాయి అని చెబుతున్నారు. ఈ రాతిని ఖరీదైన ఆభరణాలు, విగ్రహాల తయారీ కోసం చైనాకు పంపిస్తామని పచ్చరాయి వ్యాపారవేత్త ఫ్రాంక్‌ తెలిపారు. మయన్మార్‌ లో ప్రతి ఏటా 5000 కోట్ల రూపాయల పచ్చరాయి వ్యాపారం జరుగుతుందని అంచనా.

More Telugu News